ndia bowlers displayed a spirited performance after Virat Kohli's century as the hosts defeated Australia by 8 runs in the second ODI in Nagpur, to take 2-0 lead in the five-match series.
#IndiaVsAustralia2019
#indvsaus2ndODI
#MSDhoni
#ViratKohli
#vijayshankar
#mohammedshami
#ambatirayudu
#kedarjadav
#rohithsharma
#cricket
#teamindia
నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో టీమిండియానే 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. టీమిండియా నిర్దేశించిన 251 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 242 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టగా... బుమ్రా, విజయ్ శంకర్ చెరో రెండు వికెట్లు... రవీంద్ర జడేజా, కేదార్ జాదవ్ తలో వికెట్ తీసుకున్నారు. రెండో వన్డేలో విజయం సాధించడంతో ఐదు వన్డేల సిరిస్‌లో టీమిండియా 2-0 ఆధిక్యంలో నిలిచింది.
ఆస్ట్రేలియా జట్టులో పీటర్ హ్యాండ్స్ కోంబ్(48), స్టోయినిస్(52), ఖవాజా(38), అరోన్ ఫించ్(37)లు మాత్రమే ఫర్వాలేదనిపించారు. చివరి ఆరు ఓవర్లో ఆసీస్ విజయానికి 38 పరుగులు అవసరం కాగా చేతిలో ఐదు వికెట్లు ఉన్నాయి. దీంతో ఆస్ట్రేలియా విజయం సాధిస్తుందని అంతా భావించారు. అయితే, ఈ సమయంలో విజృంభించిన భారత బౌలర్లు వరుసగా వికెట్లు కూల్చి టీమిండియాకు విజయాన్ని అందించారు.
చివరి ఓవర్‌లో ఆస్ట్రేలియా విజయానికి 11 పరుగులు అవసరమయ్యాయి. చివరి ఓవర్ వేసిన విజయ్ శంకర్ 2 పరుగులిచ్చి స్టోయినిస్ (52), ఆడమ్ జంపా (2)ను పెవిలియన్‌కు చేర్చాడు. దీతో ఆస్ట్రేలియా జట్టు 242 పరుగులకు ఆలౌటైంది. దీంతో టీమిండియా 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 48.2 ఓవర్లలోనే 250 పరుగులు చేసి ఆలౌటైంది.
ఓపెనర్ రోహిత్ డకౌట్‌గా పెవిలియన్ చేరడంతో భారత జట్టు పరుగులేమీ చేయకుండానే తొలి వికెట్‌ను నష్టపోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కోహ్లీతో కలిసి శిఖర్ ధావన్ స్కోరు బోర్డుని నడిపించాడు. వీరిద్దరూ 38 పరుగుల జత చేసిన తర్వాత ధావన్(21) రెండో వికెట్‌గా నిష్క్రమించాడు. మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో ధావన్ ఎల్బీగా ఔటయ్యాడు.